హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాయిని తీరుపై దాస్యం వినయ్ భాస్కర్ విమర్శలు

HNK: పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అహంకారంతో వ్యవహరిస్తూ ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకున్నారని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు. ఎన్నికలు వస్తే ప్రజలు జై కొట్టరని, నై అంటారని వ్యాఖ్యానించారు. ఓటమి భయంతోనే ఎమ్మెల్యే సవాళ్లు విసురుతున్నారని ఆరోపించారు. రాజకీయాల్లో గెలుపోటముల కంటే ప్రజలకు జవాబుదారీగా ఉండటం ముఖ్యమని అన్నారు.