హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సముద్రంలో నిలిచిపోయిన బోటు

కాకినాడలోని ఏటిమొగ నుంచి చేపల వేటకు వెళ్లిన బోటు ఇంజిన్ వైఫల్యం కారణంగా నిలిచిపోయింది. ఉప్పాడ-తుని తీరంలోని కృష్ణాపురం సమీపంలో తీరానికి మూడు కిలోమీటర్ల దూరంలో బోటు ఆగిపోయినట్లు సమాచారం. పరిస్థితి గ్రహించిన మత్స్యకారులు వెంటనే కోస్ట్‌గార్డ్‌కు ఫోన్ చేశారు. ఫోన్ కాల్ అందిన వెంటనే కోస్ట్‌గార్డ్ అప్రమత్తమై చర్యలు చేపట్టింది.