హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

బాదంపాలుతో ఆరోగ్య ప్రయోజనాలు

బాదంపాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో క్యాలరీలు తక్కువగా ఉండి, విటమిన్ E, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. లాక్టోజ్ లేకపోవడం వల్ల పాలు పడనివారికి ఇవి చక్కని ప్రత్యామ్నాయం. ఎముకల బలానికి విటమిన్ D కలిపిన బాదంపాలు మంచివి. బరువు తగ్గాలనుకునేవారికి బాదంపాలు బెస్ట్ ఆప్షన్.