హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గంగమ్మ ఆలయంలో చోరీ

CTR: కుప్పం మండలంలోని గుట్టపల్లిలో వెలసిన గంగమ్మ ఆలయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలోని హుండీతో పాటు అమ్మవారి తాళిబొట్టును దుండగులు అపహరించినట్లు సమాచారం. ఈ ఘటనను గుర్తించిన గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనపై విచారణ చేపడుతున్నారు. చోరీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.