హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆసియా ఛాంపియన్స్ ట్రోఫి: చైనాపై భారత్ విజయం

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరుగుతున్న ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత మహిళల హాకీ జట్టు వరుసగా నాలుగో విజయాన్ని సాధించింది. గ్రూపు మ్యాచ్‌లో చైనాను 6-2 తేడాతో భారత్ ఓడించింది. దీపిక హ్యాట్రిక్ గోల్స్ చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇవాళ భారత్ తన చివరి గ్రూపు మ్యాచ్‌లో జపాన్‌ను ఎదుర్కోనుంది. ఇప్పటికే ఈ టోర్నీలో ఇండియా సెమీస్‌కు చేరుకుంది.