హైదరాబాద్: 28°C
వార్తలు

‘ఉచ్చిపిళ్లైయార్‌ మండపం’పై వెలిగిన కార్తీక దీపం

తమిళనాడులోని మదురై జిల్లా తిరుప్పరంకుండ్రం కొండపై కార్తిక దీపం వెలిగించారు. ఏటా సంప్రదాయం ప్రకారం దీపం వెలిగించే ఉచ్చిపిళ్లైయార్ ఆలయ సమీపంలోని మండపంలోనే మంగళవారం జ్యోతిని వెలిగించారు. ‘దీపతూన్’ రాతి స్తంభంపై దీపం వెలిగించేందుకు సుప్రీంకోర్టు అనుమతించినప్పటికీ, వివాదం నేపథ్యంలో పాత ప్రదేశంలోనే దీపాన్ని వెలిగించారు. జ్యోతిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.