హైదరాబాద్: 28°C
వార్తలు

'ఏడాదిలోగా మార్పురాకుంటే రాజీనామా చేయిస్తా'

AP: ప్రమాణ స్వీకారం కూడా చేయడం రానివారిని ప్రజలు నాయకులుగా ఎన్నుకుంటున్నారని.. చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావాలన్నదే తన ప్రయత్నమని TDP సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు ఏడాదిలోగా మార్పు తీసుకురాకపోతే తమ పదవులకు రాజీనామా చేయిస్తానని హెచ్చరించారు. సర్పంచ్ అంటే ఉదయాన్నే వార్డుల్లోకి వెళ్లి ప్రజా సమస్యలను పరిష్కరించి, పరిసరాలు శుభ్రం చేయించాలన్నారు.