హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఒకరి కోసం దిగితే.. ముగ్గురూ మృత్యువాత

HYD: కుటుంబ పోషణ కోసం ఎంచుకున్న వృత్తే ముగ్గురు యువకుల ప్రాణాలను బలిగొంది. స్థానిక దినేశ్ హారిక్ అపార్ట్‌మెంట్‌లో సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేసేందుకు సురేశ్, సుమన్, పవన్ వెళ్లారు. మొదట ట్యాంకులోకి దిగిన వ్యక్తి కనిపించకపోవడంతో మరొకరు, ఆ ఇద్దరి ఆచూకీ తెలియక మూడో వ్యక్తి లోపలికి దిగారు. ఈ క్రమంలో ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో విషాదం నెలకొంది.