కామారెడ్డి జిల్లా భిక్నూర్ మండలం రామేశ్వర్పల్లిలో నిర్మిస్తున్న శ్రీ సీతారామ భద్ర క్షేత్ర ఆలయానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, ఆయన భార్య మద్ది శ్యామల దంపతులు రూ.2,16,216 విరాళంగా అందించారు. ఆలయ నిర్మాణానికి తమ వంతు సహకారం మంగళవారం అందించారు.చంద్రకాంత్ రెడ్డి దంపతుల సేవాభావాన్ని ఆలయ కమిటీ సభ్యులు అభినందించారు.
తెలంగాణ
ఆలయ నిర్మాణానికి రూ.2.16 లక్షల విరాళం


