హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బేస్తవారిపేటలో ఐదు పంచాయతీలు ఏకగ్రీవం

ప్రకాశం: బేస్తవారిపేట మండలంలో మంగళవారం 5 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. చిన్న ఓబినేనిపల్లి గ్రామ సర్పంచ్‌గా బోయిళ్ల కొండారెడ్డి, జె.సి. అగ్రహారం సర్పంచ్‌గా దప్పిలి వీరారెడ్డి, ఖాజీపురం సర్పంచ్‌గా కటికల బాల యేసేబు, పిటికాయగుళ్ల సర్పంచ్‌గా కోటూరి మేరమ్మ, జె.బి.కె.పురం సర్పంచ్‌గా తిరుపతయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఆయా గ్రామాల్లో ఎన్నికల సందడి ముగిసింది.