SKLM: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నిరుద్యోగ మహిళల కోసం ఎచ్చెర్లలో మగ్గం వర్క్ ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభంకానున్నాయి. నవంబర్ 30 నుంచి యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో ఈ శిక్షణ జరుగుతుందని డైరెక్టర్ రామ్ జీ మంగళవారం తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజన సదుపాయం ఉంటుందన్నారు. వివరాలకు 9553410809, 7702180537 నంబర్లను సంప్రదించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
మహిళలకు మగ్గం వర్క్‌లో ఉచిత శిక్షణ


