KKD: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కాకినాడ జిల్లా వ్యాప్తంగా పోలీసులు మంగళవారం లాడ్జీలు, బస చేసే ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాలతో బస చేస్తున్న వారి గుర్తింపు వివరాలు, రిజిస్టర్లను పరిశీలించారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు, మద్యం పంపిణీ వంటి అక్రమాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్
లాడ్జీలలో పోలీసుల విస్తృత తనిఖీలు


