హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వార్డుల్లో మున్సిపల్ ఛైర్మన్ ఆకస్మిక తనిఖీ

KDP: ప్రొద్దుటూరు మున్సిపల్ ఛైర్మన్ నంద్యాల రాఘవరెడ్డి 16వ వార్డు సచివాలయాన్ని మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పలు రికార్డులు తనిఖీ చేసి ప్రజలకు మెరుగైన సేవలందించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం KHM స్ట్రీట్‌లోని YSR మహిళా పార్కును పరిశీలించి సుందరీకరణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.