హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పసిబిడ్డను చూసుకుంటూ పదో తరగతి చదువు'

కోనసీమ: మూడు నెలల పసిబిడ్డను చూసుకుంటూనే ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి చదువుతున్న తూర్పుపాలెం గ్రామానికి చెందిన గుమ్మడి అనంతలక్ష్మిని డీటీఓ దేవిశెట్టి శ్రీనివాసరావు అభినందించారు. ఆమె ఇంటికి వెళ్లి చదువుపై పట్టుదలను ప్రశంసించారు. లక్ష్యం నెరవేరే వరకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తన చదవు చాలా మంది పౌరులకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు.