VZM: నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని శివాలయం వద్ద శివలింగం ఆకారంలో దీపారాధన మంగళవారం సాయంత్రం నిర్వహించారు. కార్తీక మాసం పౌర్ణమి సందర్భంగా శివాలయానికి భక్తులు చేరుకొని భక్తిశ్రద్ధలతో శివునికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శివలింగం ఆకారంలో 500 దీపాలు వెలిగించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: శివలింగం ఆకారంలో దీపారాధన..


