హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భీమేశ్వర స్వామిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్

KKD: కార్తీక పౌర్ణమి సందర్భంగా సామర్లకోట శ్రీ కుమార రామ భీమేశ్వరాలయంలో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, చైర్మన్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం భీమేశ్వర స్వామి, బాలా త్రిపుర సుందరి అమ్మవార్లను దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించారు.