హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహానందిలో వైభవంగా జ్వాలతోరణం

NDL: కార్తీక పౌర్ణమి సందర్భంగా మహానంది క్షేత్రంలో మంగళవారం రాత్రి జ్వాలాతోరణం పూజలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు ముందుగా శ్రీ మహానందీశ్వర స్వామి వారి గర్భాలయం నుంచి అఖండ జ్యోతి తీసుకుని వచ్చి ఆలయ రాజగోపురం ముందు జ్వాలాతోరణం వెలిగించారు. వేలాది భక్తులు కనులారా వీక్షించారు.