హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహానందిలో కన్నుల పండుగగా కోటి దీపోత్సవం

NDL: మహానంది క్షేత్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా కోటి దీపోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వేలాదిమంది భక్తులు పాల్గొని కార్తీక దీపాలు వెలిగించి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఆలయ ప్రాంగణం కోటి దీప కాంతులతో వెలిగిపోయింది. భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టడంతో దీప పూజలో పాల్గొన్నారు. ఉదయం నుంచి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందడి కనిపించింది.