హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పామిడి మండలంలో 6 పంచాయతీలు ఏకగ్రీవం

ATP: పామిడి మండలంలో గ్రామ సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. మండలంలోని మొత్తం 20 గ్రామ పంచాయతీలకు గాను ఆరు పంచాయతీల్లో టీడీపీ మద్దతుదారులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఎంపీడీవో సౌజన్యకుమారి తెలిపారు. మిగిలిన 14 పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయని వెల్లడించారు.