హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మారెళ్ల

PLD: సత్తెనపల్లి మున్సిపల్ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన మారెళ్ల రామాంజనేయులు తన చాంబర్‌లో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించి అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, అధికారులు, కౌన్సిలర్లు, సిబ్బంది, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రజల ఆశీస్సులతో సత్తెనపల్లి పట్టణ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని ఆయన తెలిపారు.