JN: కొడకండ్ల మండల కేంద్రంలోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఏడో రోజు నిరసనలో భాగంగా మంగళవారం స్థానికులు ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహం నుంచి ప్రారంభమైన ర్యాలీ గాంధీ విగ్రహం, పాపన్న చౌరస్తా మీదుగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వరకు కొనసాగింది. మండల కేంద్రంలోనే స్కూల్ ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు.
తెలంగాణ
ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం ర్యాలీ


