WG: పాలకొల్లు మున్సిపల్ ఎన్నికల ప్రచారపర్వం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. చివరి రోజు పోటీలో అన్ని పార్టీల, స్వతంత్ర అభ్యర్థులు భారీ బైక్, సైకిల్ ర్యాలీలు చేపట్టారు. దాదాపు పది రోజుల నుంచి మైక్ సౌండ్లతో వీధుల్లో తిరిగిన ప్రచార రథాలు పార్టీ కార్యాలయాలకు క్యూ కట్టాయి. ప్రచారం ముగియడంతో ఓటర్లకు తాయిలాలు ఇచ్చే పనిలో అభ్యర్థులు నిమగ్నమయ్యారు.
ఆంధ్రప్రదేశ్
పాలకొల్లులో మున్సిపల్ ఎన్నికల ప్రచారం


