WG: రానున్న మూడు గంటల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అక్కడక్కడా మోస్తరు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 40- 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో రానున్న గంటల్లో వర్ష సూచన


