MBNR: జడ్చర్ల పట్టణంలోని మూడో వార్డు కల్వకుర్తి రోడ్డులో ఉన్న శ్రీ త్రిలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేకువజాము నుంచే భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి దీపాలు వెలిగించారు. మాజీ వార్డు కౌన్సిలర్ దేశావలి సతీష్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు.
తెలంగాణ
జడ్చర్లలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు


