హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘కోతుల నివారణకు పండ్ల చెట్ల పెంపకం చేపట్టాలి’

MHBD: కురవి మండల కేంద్రంలో సీసీ రోడ్లను ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో కోతుల బెడద నివారణకు ప్రభుత్వ భూముల్లో పండ్ల చెట్లు పెంచాలని సూచించారు. చెట్ల ద్వారా కోతులకు ఆహారం అందితే గ్రామాల్లోకి రావడం తగ్గుతుందని, గ్రామపంచాయతీ పాలకవర్గం, ప్రజల సహకారంతో ఈ ఆలోచనను అమలు చేయాలని కోరారు.