హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీసులు అడ్డుకోవడంపై మాజీ మంత్రి ఆగ్రహం

SS: పుట్లూరు మండలంలోని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను కలవడానికి వెళ్తున్న తనను పోలీసులు అడ్డుకోవడంపై సింగనమల నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో టీడీపీ నాయకుల దౌర్జన్యాలను అడ్డుకోవాల్సిన పోలీసులు, తమ పర్యటనలను నిలువరించడం సరికాదని ఆయన విమర్శించారు.