ప్రకాశం: బేస్తవారిపేట మండలం ఖాజీపురం గ్రామంలో గ్రామ సర్పంచ్‌గా వైసీపీ పార్టీ బలపరిచిన కటికల బాలేయేసేబు మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాజీ ఎంపీపీ వేగనాటి ఓసురరెడ్డి ఆధ్వర్యంలో ఈ విజయం సాధించినట్లు పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
ఖాజీపురంలో సర్పంచ్ ఏకగ్రీవ ఎన్నిక


