హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జాతీయ లోక్ అదాలత్‌పై సమావేశం

KDP: డిసెంబర్ 12న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌ను పురస్కరించుకుని కడప న్యాయసేవాసదన్‌లో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎన్. శాంతి అధ్యక్షతన ముందస్తు సమావేశం నిర్వహించారు. పెండింగ్ మోటారు ప్రమాద పరిహారం, బ్యాంకు రుణాలు, ఇతర రాజీ కేసులను ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కరించాలని సూచించారు. న్యాయవాదులు, బ్యాంకర్లు, బీమా ప్రతినిధులు పాల్గొన్నారు.