KRNL: ఈ నెల 26న ఆదోని, ఆలూరు నియోజకవర్గాల్లోని 8మండలాల్లో జరిగే తొలి విడత పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ డా.ఏ.సిరి ఆదేశించారు. ఉదయం 7నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించాలన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి, సాయంత్రం 7 గంటల్లోపు పూర్తి చేయాలని సూచించారు. వెబ్‌కాస్టింగ్ లేదా వీడియోగ్రఫీ ఏర్పాటు చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ పకడ్బందీగా నిర్వహించాలి'


