హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎరువుల దుకాణాల్లో అధికారుల తనిఖీలు

KRNL: వెల్దుర్తిలో ఎరువుల దుకాణాలను వ్యవసాయ అధికారులు మోహన్, అక్బర్ తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్లు, లైసెన్సులు, ధరల బోర్డులు, గోదాముల్లో నిల్వలను పరిశీలించారు. యూరియా, డీఏపీని నిర్ణీత ధరలకే విక్రయించాలని, ఇతర ఎరువులను లింక్ చేయరాదని ఆదేశించారు. నాణ్యత పరీక్షల కోసం నాలుగు నమూనాలు సేకరించి, ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్, క్యూఆర్ కోడ్ ద్వారా విక్రయాలు జరపాలన్నారు.