హైదరాబాద్: 28°C
క్రీడలు

28 సిక్సర్లతో వైభవ్‌ డబుల్ సెంచరీ

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ వన్డే టోర్నీలో యూఏఈ బౌలర్లకు వైభవ్ సూర్యవంశీ చుక్కలు చూపించాడు. కేవలం 52 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి చేసుకుని లిస్ట్-ఏ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీతో ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. 28 సిక్సర్లు, 7 ఫోర్లతో 204 పరుగులతో విధ్వంసం సృష్టించిన వైభవ్, డబుల్ సెంచరీ తర్వాత ఎదుర్కొన్న తొలి బంతికి ఔటయ్యాడు.