హైదరాబాద్: 28°C
తెలంగాణ

బియ్యం ధరలపై అధికారుల తనిఖీలు!

NZB: నగరంలోని సూపర్ మార్కెట్లలో తూనికలు, కొలతల శాఖ అధికారులు ఇటీవల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో బియ్యం బస్తాలను ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. రూ.2,500 ఎమ్మార్పీ ఉన్న బస్తాను రూ.2,700కు, రూ.1,820 ధర ఉన్న మరో బస్తాను రూ.2,200కు విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. అదిక దరలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు అని అదికారులు సూచించారు.