హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాండూరులో ఇల్లు దగ్ధం

VKB: తాండూరు మిట్టబస్తీలో ప్రమాదవశాత్తు ఇంట్లో వెలిగించిన దీపం నుంచి మంటలు వ్యాపించి ఇల్లు దగ్ధమైంది. గ్రామానికి చెందిన కర్ణాటక జగన్నయ్య పూజ అనంతరం దీపం వెలిగించి పొలానికి వెళ్లగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నిత్యావసర సరుకులు, ఇంటి సామగ్రి, రూ. 20 వేల నగదు కాలిపోయాయి. సుమారు రూ.లక్ష ఆస్తి నష్టం జరిగినట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.