హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోటిలింగాల కోటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ

JGL: వెల్గటూర్ మండలం కోటిలింగాల కోటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇవాళ ఉదయo నుంచే భక్తుల సందడి నెలకొంది. భక్తులు పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి కోటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో బాలాలయంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా ఏర్పాట్లు చేశారు.