హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాయికల్‌లో మధుమేహంపై అవగాహన కరపత్రాల పంపిణీ

JGL: రాయికల్‌లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డయాబెటిస్ అవేర్‌నెస్ మంత్‌లో భాగంగా 24వ రోజు ప్రజలకు మధుమేహ నివారణ, ఆరోగ్యకరమైన జీవన విధానంపై అవగాహన కల్పిస్తూ.. కరపత్రాలు పంపిణీ చేశారు. క్లబ్ అధ్యక్షుడు వాసం ప్రసాద్ వ్యాయామం, నడక, క్రమబద్ధమైన ఆహారం, క్రమం తప్పకుండా షుగర్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.