హైదరాబాద్: 28°C
తెలంగాణ

సిరిసిల్ల రైతు బజార్‌ను సందర్శించిన ఛైర్మన్

SRCL: సిరిసిల్ల రైతుబజార్‌లో నెలకొన్న సమస్యల పరిష్కారంపై మార్కెట్ కమిటీ దృష్టి సారించింది. ఇవాళ మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి డైరెక్టర్లతో కలిసి బజార్‌ను సందర్శించి పార్కింగ్, పరిశుభ్రత, మౌలిక వసతులను పరిశీలించారు. రైతులు, వ్యాపారులు, వినియోగదారులకు అసౌకర్యం కలగకుండా సమస్యలను దశలవారీగా పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు.