హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొలంగూడలో సోలార్ లైట్లు ఏర్పాటు చేసిన సర్పంచ్

ASF: వాంకిడి(M) చిచ్చుపల్లి జీపీలోని బ్రిజ్ కొలంగూడలో సర్పంచ్ కోర్వేత పద్మ ఆధ్వర్యంలో సోలార్ లైట్లను ఏర్పాటు చేశారు. విద్యుత్ సౌకర్యం లేని గ్రామ ప్రజలకు వెలుగులు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు. మాజీ సర్పంచ్ కోర్వేత జంగు, పంచాయతీ సిబ్బంది దేవరావు, రాము, పటేల్ సిడం చిన్ను, సిడం కొద్దురామ్, ఆత్రం చందు, కోర్వేత తిరుపతి పాల్గొన్నారు.