హైదరాబాద్: 28°C
తెలంగాణ

కల్లూరులో రోడ్డు ప్రమాదం..మహిళ మృతి

KMM: కల్లూరులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని వాచ్యనాయక్ తండాకి చెందిన గూగుల్ కౌసల్య (65) తన కుమారుడు కిషోర్‌తో కలిసి బైక్‌పై వెళుతుండగా వెనక నుంచి వచ్చిన మరో బైక్‌ ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన కౌసల్య చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.