MNCL: పోనకల్ గ్రామపంచాయతీలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ఆన్లైన్ దరఖాస్తుల శిబిరాన్ని సర్పంచ్ జక్కు సుష్మ-భూమేష్ ప్రారంభించారు. 18 నుంచి 59 ఏళ్ల వయస్సు వారు అర్హులని, ప్రభుత్వం ఉచితంగా అందించే ఈ పథకం కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని తెలిపారు. అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, పాల్గొన్నారు.
తెలంగాణ
పోనకల్లో ఇందిరమ్మ బీమా శిబిరం ప్రారంభం


