హైదరాబాద్: 28°C
తెలంగాణ

సదాశివ ఆలయంలో కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజలు

BHPL: గోరికొత్తపల్లి మండల కేంద్రంలోని సదాశివ ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రధాన అర్చకులు నంది విజయ్ కుమార్ శాస్త్రి ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుంచే స్వామివారికి పూజలు చేశారు. భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి కార్తీక దీపాలు వెలిగించి దర్శనం చేసుకున్నారు. దీంతో ఆలయంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.