హైదరాబాద్: 28°C
తెలంగాణ

కందగిరి లక్ష్మీనరసింహ స్వామి జాతరకు ఏర్పాట్లు పూర్తి

MHBD: కురవి మండలం కందికొండ శివారులోని ఏడు శిఖరాల గుట్టపై వెలసిన శ్రీ కందగిరి లక్ష్మీనరసింహ స్వామి వార్షిక జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా నేడు జరిగే జాతరకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి వేలాది భక్తులు తరలిరానున్నారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలతో పాటు సాయంత్రం ఆలయ శిఖరంపై అఖండ జ్యోతి వెలిగించనున్నారు.