WGL: అధికారుల పొరపాటు ఓ దివ్యాంగుడికి శాపంగా మారింది. నర్సంపేట పట్టణంలోని ద్వారకపేట్కు చెందిన గడ్డం ప్రవీణ్ గత ఏడాది జరిగిన ఓ ప్రమాదంలో తన ఎడమ చేతిని కోల్పోయారు. జీవనోపాధి కోల్పోయిన ఆయన, సదరం సర్టిఫికెట్తో దివ్యాంగుల పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, కుటుంబంలో స్వాతంత్య్ర సమరయోధుల పింఛను వస్తుందన్న కారణంతో అధికారులు తన దరఖాస్తును తిరస్కరించారని ప్రవీణ్ వాపోతున్నారు.
తెలంగాణ
పింఛను కోసం దివ్యాంగుడి ఎదురుచూపులు


