హైదరాబాద్: 28°C
వ్యాపారం

EPFO ఖాతాదారులకు గుడ్‌న్యూస్

EPFO మరో కొత్త సదుపాయం అందుబాటులోకి తేవడానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు PF డబ్బులు విత్‌డ్రా చేసుకోవాలంటే క్లెయిమ్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉండేది. కొత్త విధానం అందుబాటులోకి వస్తే నగదు ఉపసంహరణ మరింత సులభం కానుంది. UPI ద్వారా PF నిధులను తమ బ్యాంకు ఖాతాకు బదిలీ చేసుకుని, అనంతరం ATM ద్వారా నగదు తీసుకోవచ్చు. దీనివల్ల పేపర్ వర్క్ తగ్గడంతో పాటు క్లెయిమ్ ప్రాసెసింగ్ వేగవంతం కానుంది.