హైదరాబాద్: 28°C
వ్యాపారం

‘అనధికారిక గ్రే మార్కెట్ ధరలు ప్రచురించొద్దు’

షేర్ల గ్రే మార్కెట్ ధరలను పబ్లిష్ చేయవద్దని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కోరింది. ఈ మేరకు మార్కెట్ మధ్యవర్తులు, ఇన్వెస్టర్లకు కీలక సూచన చేసింది. ఐపీవోలు, షేర్ల లిస్టింగ్‌కు ముందు అనధికారికంగా జరిగే గ్రే మార్కెట్ ధరల ప్రచారం వల్ల సాధారణ మదుపర్లు తప్పుదోవ పట్టే ప్రమాదం ఉంటుంది. అందుకే పారదర్శకత కోసం ఇలాంటి అనధికారిక ధరలను ప్రచురించడం, ప్రచారం చేయడం మానుకోవాలని సెబీ సూచించింది.