హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాచిగూడకు బాంబు బెదిరింపు మెయిల్

HYD: కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ హోటల్‌లో బాంబు పేలుళ్లు జరుగుతాయని, 26/11 తరహా దాడి చేస్తామని NOV 21న వచ్చిన ఈమెయిల్ కలకలం రేపింది. పోలీసులు తనిఖీలు చేసినా పేలుడు పదార్థాలు దొరకలేదు. ఇది బూటకమని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి పంపినవారి కోసం ఆరా తీస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులపై 112కు సమాచారమివ్వాలని సూచించారు.