WGL: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు ఇవాళ సెలవు ప్రకటించారు. గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో మార్కెట్‌ను కూడా మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రైతులు ఇవాళ తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్‌కు తీసుకురావద్దని సూచించారు. బుధవారం నుంచి మార్కెట్ యథావిధిగా కార్యకలాపాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు.
తెలంగాణ
నేడు వరంగల్ వ్యవసాయ మార్కెట్‌కు సెలవు


