హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేడియల్‌ రోడ్డు పేరుతో యథేచ్ఛగా మట్టి దోపిడీ!

రంగారెడ్డి జిల్లాలో రేడియల్‌ రోడ్డు నిర్మాణం మాటున భారీగా మట్టి దోపిడీ జరుగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొదటి దశ పనులకు అనుమతులున్నాయని కాంట్రాక్ట్ సంస్థ చెబుతున్నా, సబ్‌ కాంట్రాక్టర్లు నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడ పడితే అక్కడ తవ్వకాలు జరుపుతున్నారు. ఈ మట్టిని రోడ్డు పనులకే కాకుండా ప్రైవేటు వెంచర్లకు తరలిస్తూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు మండిపడుతున్నారు.