SDPT: పవిత్ర కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని కోమటి చెరువు వద్ద మహిళలు భక్తిశ్రద్ధలతో దీపోత్సవం నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం దీపాలను వెలిగించి గంగమ్మ తల్లి ఒడిలో వదులుతూ, తమ కుటుంబాలు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు. చెరువు నీటిపై తేలియాడే దీపాల కాంతులతో అక్కడ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
తెలంగాణ
కోమటి చెరువు వద్ద వైభవంగా కార్తీక దీపోత్సవం


