హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేవైఎం మండల అధ్యక్షుడిగా పెద్దవేని కుమార్

BHPL: భూపాలపల్లి మండల భారతీయ జనతా యువమోర్చా (BJYM) అధ్యక్షుడిగా పెద్దవేని కుమార్‌ను నియమస్తూ BJYM జిల్లా అధ్యక్షుడు ఉడుత నాగరాజు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు కుమార్ మాట్లాడుతూ..యువతను పార్టీ వైపు ఆకర్షించి సంస్థను బలోపేతం చేస్తానని హామీ ఇచ్చారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన జిల్లా నాయకులకు కుమార్ ధన్యవాదాలు తెలిపారు.