హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొడంగల్లో ఘనంగా సత్యసాయి 101వ జయంతి

VKB: కొడంగల్ పట్టణంలో సన్ సిటీ కాలనీలో శ్రీ సత్యసాయి నిలయం దశరథ్ నివాసం వద్ద శ్రీ సత్యసాయి భజన మండలి ఆధ్వర్యంలో భగవాన్ శ్రీ సత్యసాయి 101వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పట్టణ వీధుల్లో బాబా పల్లకీ సేవ, ఊయ్యాల సేవ జరిపారు. 9 మందికి నెల రోజుల సరిపడా అమృతకలశం ఇచ్చి అన్న ప్రసాద సేవ చేశారు. ఈ కార్యక్రమంలో డా. రవీంద్ర యాదవ్ (RMO), భక్తులు పాల్గొన్నారు.